వైభవంగా సుబ్బారాయుడి షష్టిBack to list

 

నవంబర్ 30 ,2011 షష్టి పండుగ సందర్భం గా గ్రామంలోని సుబ్రమణ్య స్వామి దేవాలయం కన్నుల పండుగగా ముస్తాబయ్యింది. మన గ్రామం నుంచే కాక చుట్టుపక్కలనుంచి వచ్చిన భక్తులతో దేవాలయం కిట కిటలాడింది.ముందు రోజు జగాజ్యోతి ప్రజ్వలనతో పాటు ఆ రాత్రి హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించారు. తెల్లవారు జాము 3.30 నిమిషాల వరకు నాటకం కొనసాగింది.ఈ రోజు కొన్ని వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.