గుత్తికొండ సోదరులపై హత్యాయత్నం
ఘంటసాల మండలం తెలుగు రావు పాలేనికి చెందిన గుత్తికొండ కళ్యాణ్ మరియు వారి సోదరుడు రవి లపై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేసారు.ఈ ఘటన లో కళ్యాణ్ తీవ్రం గా గాయపడగా సోదరుడు రవికి గాయాలు అయ్యాయి. దీపావళి సందర్భం గా స్నేహితులతో కలిసి గ్రామమ్ లొ టపాసులు కాలుస్తుండగా అయిన చిన్న వివాదానికి ఎప్పట్నుంచో ప్రత్యర్ధులు పెంచుకున్న కక్ష తోడయ్యి ఇదే అవకాశం గా భావించి కత్తులతో దాడికి దిగారు. ప్రస్తుతం కళ్యాణ్ విజయవాడ నాగార్జున హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. గుత్తికొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ఊరికి ఎన్నో మంచి పనులు చేసిన ఈ అన్నదమ్ములకి ఇలా జరగటం పలువురిని ఆవేదనకి గురి చేసింది. వారు చేసిన పలు సేవాకార్యక్రమాలకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారని పలువురు గ్రామస్తులు తెలియచేసారు. కళ్యాణ్ గతంలో వర్లు I.T.I లో లెక్చరర్ గా పని చేశారు. ప్రస్తుతం ఒక బహుళ జాతి కంపెనీ లో ఉన్నతోద్యోగం లో ఉన్నారు. రవి హైదరాబాదు లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.కాగా ఇటీవల జరిగిన ఘంటసాల చరిత్ర పుస్తక ఆవిష్కరణ కి హాజరైన కళ్యాణ్ గ్రామం పై తనకున్న అభిమానాన్నిప్రసంగం లో తెలియ చేశారు.అంతే కాకుండా వెబ్ సైట్ నిర్వహణ కి అవసరమైన తోడ్పాటు ని అందిస్తున్నారు. నిస్వార్ధం గా, సేవా భావం తో అందరితో మెలిగే ఆ అన్నదమ్ములు త్వరగా కోలుకోవాలని మనఘంటసాల.నెట్ ఆశిస్తోంది.