విరాళాన్ని అందచేస్తున్న వెబ్ సైట్ ప్రతినిధి రాజేష్ వేమూరి, ఇన్ సెట్ లో మాధవి గొర్రెపాటి.
రజకుల రామాలయ పునర్నిర్మాణం అనే కధనానికి స్పందించిన శ్రీ గొర్రెపాటి మాధవి అమెరికా నుంచి 10000/- విరాళాన్ని అందించారు. తన తండ్రి గొర్రెపాటి రాధాకృష్ణయ్య (ఫాన్సీ షాపు) జ్ఞాపకార్ధం ఆమె తన విరాళాన్ని మనఘంటసాల.నెట్ ద్వారా అందించారు. మన ఊరి రజకుల కోలాటం అంటే తనకెంతో ఇష్టం అని ఆ అభిమానం తోనే వారికి ఏదైనా చెయ్యాలని సంకల్పించినపుడు ఈ కధనం చూసి వారి రామాలయ నిర్మాణం లో తనకు చేతనైనంత సాయం చెయ్యాలని అనిపించిందని ఆవిడ తెలిపారు. ఈ సందర్భం గా దేవాలయ కమిటీ సభ్యులంతా ఆమెకి కృతఙ్ఞతలు తెలియ చేశారు.