జలధీశ్వరాలయం తర్వాత అతి ప్రాచీనమైనది మన విశ్వేశ్వరాలయం.ఈ ఆలయం శిధిలమైపోగా బోలెం గుంటలో లింగాకారమును తెచ్చి మట్టి ఆడుసు తో చిన్న ఆలయమును కట్టించారు.కొంతకాలానికి అదీ శిధిలమైపోగా రెంటచింతల అచ్చన్న అనే ఆయన కాశీ నుంచి ఒక లింగమును తెచ్చి వేమూరి ఘంటయ్య గారి సహకారముతో ఇపుడు ఆలయమున్న ప్రదేశంలో 1860లో నిర్మించారు.