విధి పొమ్మంది – మానవత్వం ఆదుకుందిBack to list

గ్రామానికి చెందిన కూరాళ్ల ధనరాజ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అతని కుటుంబం గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. ధనరాజ్ ఆరోగ్యం మరింత క్షీణించటంతో ఇంటి యజమాని ఆ కుటుంబాన్ని ఖాళీ చేయించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి మన ఊరి పార్క్ దేవాలయం లా కనిపించింది. పార్క్ ప్రతినిధులని కలిసి సమస్యని విన్నవించగానే వెంటనే స్పందించి పార్క్ లో ఉన్న కమ్యూనిటీ భవనంలో వారికి ఆశ్రయం కల్పించారు. మంగళవారం మధ్యాహ్నం ఆరోగ్యం మరింత క్షీణించి ధనరాజ్ మృతి చెందాడు. అనంతర కార్యక్రమాలన్నీ కూడా అదే భవనంలో జరిపారు. విధి పొమ్మన్నా మన ఊరి పార్క్ ప్రతినిధులు మానవత్వం తో ఆదుకోవటమే కాకుండా దిక్కుతోచని తమకు అండగా నిలిచారని ధనరాజ్ కుటుంబ సభ్యులు తెలిపారు.

 

రుద్రభూమి కి దగ్గరలో వీరపనేని సరోజినీ పార్క్ నిర్మించిన తరువాత కులమత భావనలకి అతీతంగా ప్రతి ఒక్కరు అందులో ఉన్న కమ్యూనిటి భవనాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందులో విశాలమైన భవనంతో పాటు గ్రంధాలయం కూడా ఉంది. ఇలాంటి సమస్యలు ఎదురైనపుడు మన ఊరి పార్క్ ని వినియోగించుకోవచ్చని మాజీ జెడ్పి వైస్ చైర్మన్ శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ తెలిపారు. ఊరిలో ఉన్న అందరు ప్రజలకి ఉపయోగపడాలనే సదుద్దేశంతో కులమతాలకి అతీతంగా వీరపనేని సోదరులు ఈ పార్క్ నిర్మించారని తెలియచేసారు.  

 Dated : 03.01.2017