ఘంటసాల చరిత్ర సిగలో మరో మేలి ముత్యంBack to list

బౌద్ధ స్తూపం వద్ద దొరికిన 2 వ శతాబ్దం నాటి పాలరాతితో బుద్ధ ప్రతిమని చెక్కించటం జరిగినది.ఘంటసాల నుండి తరలించబడి పారిస్ మ్యూజియం లో ఉన్న బుద్దుడి విగ్రహ నమూనాతో అదే కొలతలతో విగ్రహాన్ని రూపొందించారు. 

 

 

 

ఇప్పటి వరకు ఘంటసాలలో  దొరికిన స్తంభాలు , విగ్రహాలు , శాసనాలు అన్నీ యధాతధంగా మ్యూజియంలో ఉంచటం జరిగింది. అయితే ​ఇక్కడి నుండి తరలిపోయిన శిల్పాలని వెనక్కి తెప్పించటం సాధ్యం కాదు కనుక వాటి నకలు ని తయారు చేయిస్తే భావితరాల వారికి వీటి గురించి తెలుస్తుంది అనే ఉద్దేశంతో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ గారు 2 వ శతాబ్ది నాటి రాయితోనే వీటిని చెక్కించటం సముచితమని భావించి ఈ విగ్రహాన్ని తయారు చేయించారు.అతి త్వరలో దీనిని పురావస్తు శాఖ వారికి అందించి మ్యూజియంలో ఉంచబోతున్నారు.

dated : 16.06.2017