శ్రీ జలధీశ్వరస్వామి ఆలయ చరిత్ర​ Back to list

  ఘంటసాల గ్రామము లో ఈ దేవాలయానికి ఎంతో పురాతన ప్రశస్తి కలిగి ,క్రీస్తు శకారంభము నుండి 15 వ శతాబ్దము వరకు అర్చకులు ,వాయిద్య కారులు, దేవదాసీలు ,దేవాలయ వివిధ కార్యక్రమ నిర్వాహకులు వందలాది మంది చే నిర్వహించబడి అపురూప క్షేత్రముగా విరాజిల్లినది.నేటికి దేవాలయము లో ఉన్న పాలరాతి శాసనములు ద్వారా విశదీకరించబడినది.భారత పురావస్తు శాఖ వారు ఈ దేవాలయము ఎంతో పురాతనమైనదని పరిశోధనల ద్వారా తెలిపి సదరు శాసనాన్ని ద్రువపర్చినారు.కాశి ,శ్రీశైలం ,శ్రీ కాళహస్తి తదితర అపురూప క్షేత్రాల యశస్సు ఏ క్షేత్రములో ఉన్నట్లు పండితుల ఉవాచ.