జలధీశ్వరాలయ అభివృద్ధి కమిటీ నివేదికBack to list

 

శివ పార్వతులు ఏక పీఠము పై వెలసిన ఏకైక పురాతన క్షేత్రము శ్రీ బాల పార్వతీ సమేత జలదీశ్వర స్వామి వారి దేవాలయము పునర్వైభవము లో భాగస్వాములై అభివృద్ధికి విరాళాలు అందించండి.

మన ఘంటసాల గ్రామము లో ఈ  దేవాలయానికి ఎంతో పురాతన ప్రశస్తి కలిగి ,క్రీస్తు శకారంభము నుండి 15 వ శతాబ్దము వరకు అర్చకులు ,వాయిద్య కారులు, దేవదాసీలు ,దేవాలయ వివిధ కార్యక్రమ నిర్వాహకులు వందలాది మంది చే నిర్వహించబడి అపురూప క్షేత్రముగా విరాజిల్లినది.నేటికి దేవాలయము లో ఉన్న పాలరాతి శాసనములు ద్వారా విశదీకరించబడినది.భారత పురావస్తు శాఖ వారు ఈ దేవాలయము ఎంతో పురాతనమైనదని పరిశోధనల ద్వారా తెలిపి సదరు శాసనాన్ని ద్రువపర్చినారు.కాశి ,శ్రీశైలం ,శ్రీ కాళహస్తి తదితర అపురూప క్షేత్రాల యశస్సు ఏ క్షేత్రములో ఉన్నట్లు పండితుల ఉవాచ. ఇట్టి క్షేత్రమునకు పూర్వ వైభవము తేవాలని భక్తులకు ఇటివల భావన కలిగినది.

 

Download the Full Details Here