ఎ / సి కళ్యాణ మండపం ​నిర్మాణంBack to list

 ప్రస్తుతం ఉన్న కళ్యాణ మండపం గ్రామంలో ఉన్న అందరి అవసరాలని తీర్చలేకపోతున్న తరుణంలో , అదే ప్రాంగణంలో మరిన్ని వసతులతో మరో కళ్యాణ మండపం నిర్మించాలని కమిటీ నిర్ణయించింది. కేవలం పెళ్ళిళ్ళకి మాత్రమే కాకుండా చిన్నపాటి కార్యక్రమాలకి కూడా అందరూ కళ్యాణ మండపమే వినియోగిస్తుండటంతో ఒకేసారి రెండు మూడు కార్యక్రమాలు ఉన్నపుడు మిగతావారు అటు చల్లపల్లి గాని ఇటు మొవ్వ గాని వెళ్ళిపోవటం జరుగుతోంది. అదీ కాకుండా మన ప్రస్తుత కళ్యాణ మండపం ఎ / సి కాకపోవటంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఎ / సి కళ్యాణ మండపాలకి వెళుతున్నారు. భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకున్నా మరో కళ్యాణ మండపం మనకి తక్షణ అవసరం. అందుకే ఇప్పుడు ఉన్న కళ్యాణమండపం పై అంతస్తులో  ఎ / సి  కళ్యాణ మండపం నిర్మించటానికి కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. ఈ నిర్మాణంలో పాలుపంచుకోవాలనుకునే దాతలు ప్రస్తుత కళ్యాణ మండప నిర్మాణ కర్త శ్రీ వేమూరి శివరామకృష్ణయ్య (పట్టాభి) మరియు మాజీ జెడ్ పి వైస్ చైర్మన్  శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ  గార్లను సంప్రదించగలరు.

         

 

Dated: 15.10.2015